ఆంధ్రప్రదేశ్ లో దారుణం.. గర్భవతులైన ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లు

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : విధి వంచితమో, విధి యోగమో కానీ మైనర్లయిన అక్కా చెల్లెళ్లిద్దరూ మోసపోయారు. దుష్టుల దుర్మార్గ ఫలితంగా వారిద్దరూ వంచనకు గురయ్యారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న వారిద్దరూ పెళ్లి కాకుండానే గర్భవతులైన దారుణ ఘటన చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పరిధిలోని పమిడి ముక్కల మండలంలోని ఓ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. సొంత అక్కా చెల్లెళ్లయిన ఇద్దరు మైనర్లు గర్భవతులయ్యారు.

వీరిలో అక్క డిగ్రీ ఫస్టియర్ చదువుతుండగా, చెల్లెలు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరిలో ఒకరికి ఆరో నెల, మరొకరికి 9వ నెల గర్భం వచ్చింది. ఒకేసారి ఇద్దరూ గర్భం దాల్చిన ఘటన గురంచి తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు.

ఇద్దరు అక్కాచెల్లెళ్లు గర్భం దాల్చడానికి కారణం ఎవరనే విషయంపై విచారణ సాగుతోంది. ఇద్దరి గర్భానికి ఒకరే కారణమా, లేక వేర్వేరు వ్యక్తులా అనే కోణంలో విచారణ జరుగుతుంది.

గర్భం దాల్చిన విషయంపై ఇద్దరు మైనర్లు ఇప్పటి వరకూ నోరు మెదపలేదని తెలిసింది. కుటుంబ, బంధువులు ఎవరైనా కారణమా, సమీప ఇళ్ల వారా, లేక స్నేహితులు కారణమై ఉండొచ్చా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.