Home Latest News బోనాల ఉత్సవాలకు పోస్టాఫీసు సేవలు

బోనాల ఉత్సవాలకు పోస్టాఫీసు సేవలు

ఈనెల 30 నుంచి ఆషాఢ బోనాలు షురూ కానున్నాయి. హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆలయాల్లో బోనాలు పెట్టుకునే వాళ్లు, ప్రత్యేక పూజల కోసం పోస్టాఫీసు సేవలు అందించేందకు తపాలా శాఖ ముందుకొచ్చింది.

ఈ మేరకు శనివారం నుంచే సేవలను షురూ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 547 తపాలా కార్యాలయాల ద్వారా ప్రత్యేక సేవల బుకింగ్స్ ప్రారంభించారు.

ఈనెల 30 నుంచి వచ్చేనెల 27 వరకు బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో కల్యాణానికి రూ.500, బోనం సేవకు రూ.300, ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనం సేవకు రూ.300 చెల్లించాలని తపాలా శాఖ పేర్కొన్నది.

ఈ మేరకు ఆగస్టు 1నుంచి ఆలయాల నుంచి ప్రసాదం అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.