చొక్కా విప్పి చూడు మనీ ఉండు.. బ్యాగులోన కూడ డబ్బులుండు!

ఇదేంది.. పద్యంలెక్క పాడబట్టె అనుకుంటున్నారా.. ఔనండీ.. అతడి చొక్కాలోపల, బ్యాగు లోపలా కట్టలు కట్టలుగా డబ్బు బయట పడింది. ఎక్కడిది.. ఎవరిది.. ఎక్కడ బయట పడింది.. ఎవరు పట్టుకున్నారు.. అనుకుంటున్నారా.. కిందికి వెళ్లండి.

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో రైల్వే పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. గంజాయి, హవాళా మనీ, మద్యం అక్రమ రవాణాపై వారు ఈ తనిఖీలు చేపట్టారు. అయితే ఆంధ్రా నుంచి రైలులో వెళ్తున్న ఓ యువకుడి వద్ద ఆశ్యర్యకరంగా మనీ బయట పడింది.

విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ కు రైలులో వెళ్తున్న ఆ యువకుడిని అనుమానంతో పరిశీలించారు. అతడి చొక్కా లోపల మరో రెడీమేడ్ జాకెట్ ఉంది. దానికి జిప్పులు అమర్చి ఉన్నాయి. 3 పొరలుగా ఉన్నాయి.

వాటిల్లో రూ.30 లక్షల వరకు నోట్ల కట్టలు బయట పడ్డాయి. అతడి వద్ద ఉన్న బ్యాగు నుంచి మరో రూ.30 లక్షల నగదు దొరికింది. మొత్తంగా రూ.60 లక్షల నగదును అతడు తరలిస్తుండగా పట్టుపడింది.

ఆ నగదుకు ఎలాంటి ఆధారాలను అతడు చూపకపోవడంతో ఆ నగదును సీజ్ చేసి విచారణ చేపట్టారు. ఆ మనీ ఎవరిది, ఎక్కడికి తరలిస్తున్నారు.. దీని వెనుక ఎవరున్నారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

చూశారా.. ఎవరూ కానకుండా ఉండేందుకు చాకచక్యంగా నగదు తరలించాలని ఎంచక్కా ప్లాన్ వేశాడు. ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటాక చెన్నైలో పట్టుబడ్డాడు. ఇంకొంచెం దాటితే సేఫ్టీగా మనోడు బయటపడేవాడన్నమాట.