దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన గుర్తిపును సొంతం చేసుకుంది. ప్రత్యేక చర్యల వల్ల ఆ గుర్తింపు దక్కింది. దేశంలోనే తొలిదైన ప్రత్యేకతను అది సొంతం చేసుకుంది.
రాజధాని నగరంలో కాలుష్యంతో జనం విసుగెత్తి పోతుండగా అక్కడి ఎయిర్ పోర్టు మాత్రం కాలుష్య రహితంగా మారి ప్రత్యేకతను చాటుకుంది. దేశంలోనే తొలి పూర్తిస్థాయి హైడ్రో, సోలార్ పవర్ ఎయిర్ పోర్టుగా ఢిల్లీ విమానాశ్రయం నిలిచింది.
ఈ విమానాశ్రయాన్ని పూర్తిగా హైడ్రో, సోలార్ పవర్ తోనే నిర్వహిస్తున్నారు. 2030వ సంవత్సరం నాటికి దీన్ని పూర్తిగా కార్బన్ ఉద్గార రహిత విమానాశ్రయంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ చర్య వల్ల సుమారు 2 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని అధికారులు తెలిపారు.