ప్రజలు భాగస్వాములు కావాలి

పట్టణ ప్రగతి అవగాహన సభలో మంత్రి గుంతకండ్ల

సూర్యాపేట : పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 45 వార్డ్ లో బుధవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డ్ కమిటీ సభ్యులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికులతో  అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ జూలై 1 నుంచి జులై 10 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని బంగారు తెలంగాణ లో భాగస్వాములు కావాలన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ ను అధోగతి పట్టించాయని దుయ్యబట్టారు. సూర్యాపేట పట్టణాన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాన్నమని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలోరాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాసు గౌడ్, మునిసిపల్ చైర్ పర్సన్ పేరుమాళ్ళ అన్నపూర్ణ, కమిషనర్ పి.రామానుజుల రెడ్డి, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, కౌన్సిలర్ గండురి పావని కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.