* జిల్లా గౌడ సంఘం, సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మిర్జాగూడ గ్రామ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్
రచ్చబండ, శంకర్ పల్లి: గ్రామాల్లో గౌడ సంఘం సభ్యులు ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో, చెరువు గట్లపై తాటి, ఈత మొక్కలను విరివిరిగా నాటాలని రంగారెడ్డి జిల్లా గౌడ సంఘం, సర్పంచుల సంఘం అధ్యక్షుడు, శంకర్ పల్లి మండలం మిర్జాగూడ గ్రామ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం కూడా గౌడ కులస్తులకు ఎంతో సహకరిస్తున్నదని చెప్పారు. తాటి, ఈత మొక్కలు నాటడం వల్ల గౌడ కులస్తులు ఆర్థికంగా ఎదగడంతోపాటు, వారి కుటుంబ పోషణకు సహకరిస్తాయని తెలిపారు. గీత కార్మికులకు జీవనాధారమైన ఈ మొక్కలను నాటడం వల్ల ఎంతోమందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.