సీపీఎస్ భూతాన్ని తరిమికొట్టాలి

* ఈ నెల 12న ఛలో హైదరాబాద్
* తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎండి తాహేర్ అలీ
రచ్చబండ, శంకర్ పల్లి : సీపీఎస్ భూతాన్ని తరిమికొట్టాలని కోరుతూ తమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12న ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎండి తాహేర్ అలీ తెలిపారు. ఈ మేరకు సోమవారం పోస్టర్ విడుదల చేశారు. అనంతరం అయన మాట్లాడారు. దేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గానికి పెనుభూతంగా మారిన సీపిఎస్ మహమ్మారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా సిపిఎస్ ఉద్యమాలు ఊపందుకుంటున్న తరుణంలో మళ్లీ ఓపీఎస్ ప్రవేశపెట్టే విషయంలో పునరాలోచిన చేయాలని, 2004 వరకు కొనసాగిన ఓపిఎస్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా యథాతధంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పునరాలోచన చేసి పూర్తిస్థాయి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మర్పల్లి అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు రాము శర్మ, శ్రీనివాస్, మండల టిఎస్సిపిఎస్ ఈయూ అధ్యక్ష, కార్యదర్శులు సంజీవ్ కుమార్, సుదర్శన్, ఉపాధ్యక్షులు దేవేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు ఆశీర్వాదం, వెంకటేష్, శ్రీనివాస్, శ్రీనివాస్ రాజు, వనజ, పద్మజ, విజయలత, విజయ లక్ష్మి, ఆరీఫ్, శ్రీనివాస్ రెడ్డి, రవి కాంత్ రెడ్డి, నౌషీన్, యాస్మీన్, సదా లక్ష్మీ, దశరథ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు