10న ఉపాధ్యాయ సమస్యలపై ధర్నా

* తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కాశీరావు

రచ్చబండ, శంకర్ పల్లి : శంకర్ పల్లి మండల స్థాయి ఎఫ్ఎల్ఎన్ శిక్షణ జరుగుతున్న తెలంగాణ మోడల్ స్కూల్ లో ఈనెల 10వ తేదీన తపస్ రంగారెడ్డి జిల్లా పక్షాన కలెక్టరేట్ కార్యాలయంలో ముందు జరుగు ధర్నా కార్యక్రమంలో ఉపాద్యాయులు అందరూ పాల్గొనాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కాశీరావు పిలుపునిచ్చారు.

అపరిస్కృత ఉన్న ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించని కారణంగా ఉద్యోగ ఉపాధ్యాయులు మానసిక క్షోభ కు గురి అవుతున్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట్ర రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ లక్ష్మయ్య, శంకర్పల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరరావు వారి ఉపాధ్యాయ బృందం, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగయ్య, శీను, ఉపాధ్యాయులు సుగుణ, నవనీత, కృష్ణయ్య, ఉమామహేశ్వరరావు, మల్లేశం, సంధ్య, మల్లికార్జున, ఆనందం, సుజంద్రకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

పరిష్కరించాల్సిన సమస్యలు
1. పీఆర్సీ కమిటీని వేసి వెంటనే మద్యంతర భృతినీ ప్రకటించాలి
2. సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి
3. 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు సొంత జిల్లాలకు వెళ్లేందుకు అవకాశం కల్పించి సూపర్ న్యూమరికల్ పోస్టులు మంజూరు చెయ్యాలి
4. పండిత్ పీఈటీల పోస్టులను ఆఫ్ గ్రేడేషన్ చేయాలి
5.ఏకీకృత సర్వీస్ రూల్స్ ఇతర అంశాలపై ఉన్న కేసులను కోర్టు ద్వారా పరిష్కరించి అన్ని కేటగిరిలో ప్రమోషన్లు బదిలీలు చేయాలి