శివరాత్రి పర్వదినాన మాత్రమే తెరిచే శివాలయం

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : మహాశివరాత్రి పర్వదినాన్ని హిందువులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. మహిమాన్వితుడైన పరమ శివుడిని భక్తితో వేడుకుంటారు. ఉపవాసాలు ఉండి రాత్రి జాగరణ చేస్తూ శివతత్వాన్ని వింటారు. ఈ సందర్భంగా శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగుతుంటాయి. సాధారణ సమయాల్లోనూ శివలింగాలు పూజలందుకుంటాయి.

కేవలం మహా శివరాత్రిని పురస్కరించుకొని ఓ శివాలయం గుడి తలుపులు తెరుచుకుంటాయి. ఈ రోజు శివుడికి పూజలు జరిపాక గుడికి తాళాలు వేస్తారు. మళ్లీ వచ్చే శివరాత్రి నాడే తెరుస్తారు. దీనికో చరిత్ర కూడా ఉంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ సమీపంలోని 1,000 అడుగుల ఎత్తయిన కొండపై సోమేశ్వరాలయం ఉంది. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించారు. అయితే ఇది మూతపడి ఉంది. ఈ ఆలయాన్ని అందుబాటులోకి తేవాలని 1974లో ఉద్యమమే నడిచింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశ్ సేథీ సోమేశ్వరాలయాన్ని తెరిపించారు.

ఇలా కేవలం శివరాత్రి ఒక్కరోజే తెరుస్తారు. పూజలు జరిపిస్తారు. మళ్లీ తాళాలు వేసి మూస్తారు. మళ్లీ ఏడాది ఈ గుడి తాళాలు తెరుచుకుంటాయి.