ఇది మరీ విడ్డూరం.. మహిళలు ఎన్నికైతే పురుషుల ప్రమాణస్వీకారం

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : ఇదేందయా ఇది.. అని ముక్కున వేలేసుకునే పరిస్థితి. మహిళలు ప్రజాప్రతినిధులైతే వారి తరఫున పురుషులు అధికారం చెలాయిస్తారనేది మనం విన్నాం. కొన్ని సమావేశాల్లోనూ పురుషులు పాల్గొన్నారని కూడా చూశాం. కానీ ఇక్కడ ఏకంగా మహిళల తరఫున వారి కుటుంబాల్లోని పురుషులు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్, దుమేహ్ జిల్లాల్లో తాజాగా పలు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. పలుచోట్ల మహిళలు ఎన్నికయ్యారు. కొన్నిచోట్ల మహిళలు ఎన్నికైతే వారి కుటుంబ సభ్యులైన పురుషులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఒక చోట మహిళ స్థానంలో ఆమె తండ్రి పదవీ ప్రమాణ స్వీకారం చేశాడు. మరో చోట మహిళ భర్త, ఇంకో చోట మహిళ బావ పాల్గొని ప్రమాణం చేశారు. అధికారులు కనీం అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

చూశారా.. మహిళ స్థానంలో పురుషులు పెత్తనం చెలాయించడం దేవుడెరుగు ప్రమాణం కూడా పురుషులే చేస్తే మహిళా సాధికారత అమలయ్యేదెలా అని ముక్కున వేలేసుకోవడం మన వంతు.