తెలంగాణ రాష్ట్రంలోని 23 ఏకలవ్య మోడల్ స్కూళ్లల్లో 262 పోస్టులను భర్తీ చ్చేయనున్నారు. వీటికి దరఖాస్తు గడువు ఈ నెలాఖరు వరకు ఉంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 168 టీజీటీ పోస్టులు ఉన్నాయి. 11 ప్రిన్సిపాల్ పోస్టులు కాగా 6 వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు, 77 పీజీటీ పోస్టులు ఉన్నాయి.
టీజీటీ పోస్టులకు సీటెట్ అర్హత కలిగిన వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెట్లోనూ అర్హత సాధించిన అభ్యర్థులు కూడా అర్హులేనని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 50 శాతం మార్కులతో డిగ్రీ, టెట్లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేస్కొవచ్చు అని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 30 లోగా https://recruitment.nta.nic.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నది.