* సర్పంచుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రవీందర్ గౌడ్
రచ్చబండ, శాంకర్ పల్లి : మోకీలను నుతన మునిసిపాలిటీ చేయాలని సర్పంచుల సంఘం రంగారెడ్డి జిల్లా అద్యక్షుడు రవీందర్ గౌడ్ కోరారు. బుధవారం ఆయన శంకరపల్లి మండలంలోని మోకిలాలో విలేకరులతో మాట్లడారు. మోకిలా పరిధిలోని మోకిలా, మోకిల తండా, కొండకల్, కొండకల్ తండా, గోపులారం, మహరాజ్ పేట్, దొంతన్ పల్లి, మిర్జాగుడ, జన్వాడ, ఇరుకుంట తండా, పొన్నగుట్ట తండా, పిల్లిగుండ్ల, శేరిగూడ గ్రామాలను కలిపి మోకీల మునిసిపాలిటీగా చేయలని కోరారు.
రోజురోజుకు అభివృద్ది పథంలో దూసుకుపొతున్న మోకిలాను కొత్తగా మునిసిపాలిటీ చెస్తే ఇక్కడి ప్రజలకు ఏంతో మెలు జరుగుతుందని అన్నారు. మోకిలాను వేరే మున్సిపాలిటీలో కలపకుండా ప్రత్యేక మునిసిపాలిటీ చేయలని, లేకుంటే యథావిధిగా తమ గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఉంచాలని కొరారు.
సమావేశంలో సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గోపులారం సర్పంచ్ పొడవు శ్రీనివాస్, మండల కోశాధికారి మహరాజ్ పేట్ సర్పంచ్ నర్సిమ్మరెడ్డి, శంకరపల్లి మర్కెట్ కమిటి వైస్ చెర్మన్ కుర్మ వెంకటేశ్, శంకరపల్లి మర్కెట్ కమిటి మాజీ చైర్మన్ సభవత్ రాజు నాయక్, జనవాడా సర్పంచ్ లలిత నర్సిమ్మ, ఇరుకుంట తండా సంతొషి శంకర్ నాయక్, దొంతన్ పల్లి సర్పంచ్ అశ్విని సుధాకర్, పిల్లిగుండ్ల సర్పంచ్ సత్యనారయణ రెడ్డి, శేరిగూడ సర్పంచ్ సత్యనారయణ, మోకీల ఎంపిటీసీ సరిత రాజు నాయక్, కొండకల్ ఎంపిటీసీ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.