ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు అప్రమతంగా ఉండాలి

  • శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య

రచ్చబండ, శంకర్ పల్లి: ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుందందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శంకర్ పల్లి మండల ప్రజా పరిషత్ అధికారి వెంకయ్య సూచించారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని జనవాడ, మిర్జాగూడ, పొద్దుటూరు గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాగులు పొంగిపొరుగుతున్నాయని, వాటి వద్దకు ఎవరు కూడా వెళ్లకూడదని తెలిపారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు. వర్షాలు ఇంకా 40 గంటల వరకు కురుస్తాయని అందువల్ల ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. జనవాడ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఇంటిని జేసీబీతో తొలగించారు. పొద్దుటూరు గ్రామ సమీపంలో నిండుగా ప్రవహిస్తున్న మూసీ నదిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో గీత, ఏపీవో నాగభూషణం పాల్గొన్నారు.