రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు వర్షాలు పడుతుందని జాగ్రత్తగా ఉండాలి సిఐ. నరేష్ తెలిపారు. గురువారం హైదరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో గల గ్రామాల ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూలిపోయే ఇండ్లలో నివసించే ప్రజలు సురక్షిత నివాసాలకు తరలి వెళ్లాలని సూచించారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలో నివసించే ఇండ్లలోకి వర్షపు నీరు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు.
గ్రామ సమీపంలోని చెరువులు, వాగుల వద్దకు యువకులు, చిన్నపిల్లలు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలన్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్త ఉండాలి అన్నారు. మూసీ నది సమీపంలో నివసించేవారు వెంటనే సురక్షిత స్థలాలకు వెళ్లాలని తెలిపారు.
భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయని వాహనదారులు తమ వాహనాలను సురక్షితంగా నడిపి స్తానాలకు చేరుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే మోకిలా పోలీస్ వారికి లేదా,100 నెంబర్కు ఫోన్ ఫోన్ చేయాలని తెలిపారు. కాగా ఎస్సై కృష్ణతో కలిసి సిఐ నరేష్ పొద్దుటూరు గ్రామ సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నదిని పరిశీలించారు.