శంకర్ పల్లి మున్సిపాలిటీలో దశలవారీగా అభివృద్ధి

* వైస్ చైర్మన్ బానూరు వెంకట్రామిరెడ్డి.

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మున్సిపాలిటీ వార్డులలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని మున్సిపల్ వైస్ చైర్మన్ భానూరు వెంకట్ రామ్ రెడ్డి అన్నారు. బుధవారం మునిసిపాలిటీలోని మూడో వార్డుల బోరును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మునిసిపాలిటీలోని వార్డులలో 80 శాతం వరకు అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి,. ఎమ్మెల్యే కాలే యాదయ్య సహాయ సహకారాలతో మునిసిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.

కార్యక్రమంలో శంకర్ పల్లి మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, నాయకులు పి. బాలకృష్ణ, కాశెట్టి వెంకటేశం, నరేందర్, జ్ఞానేశ్వర్, మూడో వార్డు బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు జొన్నాడ మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.