రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : ఆమె వయసు 29 ఏళ్లు. భర్త, ఇద్దరు పిల్లలున్నారు. వారింటికి ఎదురింట్లో ఉండే బాలుడి వయసు 15 ఏళ్లు. ఉన్నట్టుండి బాలుడి ఆచూకీ కనిపించలేదు. వెతుకుతుండగా, ఎదురింటి మహిళ ఆచూకీ లేదని తెలిసింది. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు ఆ మహిళపై అనుమానంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడ పట్టణానికి చెందిన ఓ కాలనీలో ఉండే ఓ కుటుంబంలోని 15ఏళ్ల బాలుడి జాడ సోమవారం కనిపించక లేదు. దీంతో బాలిడి స్నేహితుల వద్ద వెతికారు. బంధువుల ఇళ్లలోనూ ఆచూకీ దొరకలేదు.
వారి ఎదురింట్లో ఉండే వివాహిత (29) కూడా కనిపించట్లేదని తెలిసింది. దీంతో బాలుడి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఆ మహిళే తమ బాలుడిని కిడ్నాప్ చేసిందని అనుమానం కలిగింది. ఈ మేరకు ఆమె తమ బాలుడిని కిడ్నాప్ చేసిందని వారు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. వారిద్దరూ ఎక్కడున్నారు, ఎక్కడికెళ్లారనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
భర్త, ఇద్దరు పిల్లలున్న వివాహిత బాలుడిని ఎందుకు తీసుకెళ్లిందనే విషయంపై ఆరా తీయసాగారు. డబ్బుల కోసం తీసుకెళ్లిందా, లేక మరేదైనా కారణమా అనే విషయాలపై విచారణ చేస్తున్నారు.
కేసు పురోగతి?
బాలుడి మిస్సింగ్, కిడ్నాప్ కేసు పురోగతి సాధించినట్లు తెలిసింది. ఈ మేరకు బాలుడు సహా వివాహిత యువతి హైదరాబాద్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిద్దరినీ పోలీసులు గుడివాడకు తరలించనున్నారు. కేసు వివరాలను బుధవారం సాయంత్రం కానీ, రేపు కానీ వెల్లడించే అవకాశలున్నట్లు తెలిసింది.