నా పక్కనే కూర్చుంటావా.. అని చిరంజీవిపై చిర్రుబుర్రులాడిన హీరోయిన్

మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలనచిత్ర రంగానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్, అనంతరం దాసరి నారాయణరావు తర్వాత చిరంజీవిపై ఆ బాధ్యత పడిందంటే అతిశయోక్తి కాదు. కానీ అంతటి చిరంజీవికి సినీరంగం తొలినాళ్లలో పలు అవమానాలు ఎదురయ్యాయి. వాటన్నింటనీ భరించిన ఆయన నేడు అందరికంటే అందని మెట్టుపై నిలబడి చిరుదరహాసం చిందిస్తున్నాడు.

మెగాస్టార్ చిరంజివి వర్ధమాన నటుడిగా ఎదుగుతున్న సమయంలో పలు అవమానాలు ఎదురయ్యాయి. ఓ సినిమా షూటింగ్ కోసం ఓ ప్రముఖ హీరోయిన్, చిరంజీవి కోసం కారు పంపారు. మొదట ఆ హీరోయిన్ ను కారులో ఎక్కించుకున్నాక చిరంజీవి వద్దకు వచ్చింది.

అప్పుడు చిరంజీవి కారు డోరు తీసుకొని వెనుక సీట్లో కూర్చున్నాడు. వెంటనే ఆ హీరోయిన్ కు చిర్రెత్తుకొచ్చిందట. ‘హౌ డేర్ యూ.. నా పక్కనే కూర్చుంటావా.. వెళ్లు డ్రైవర్ పక్కన కూర్చో’ అని గద్దించిందామె.

చిన్నబుచ్చుకున్న చిరంజీవి కిమ్మనకుండా వెళ్లి డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడట. అప్పుడు చిరంజీవిని అంతలా అవమానించిన హీరోయిన్.. అదే చిరంజీవి సరసన నటించి, ఆయన కోసం గంటలకొద్దీ వెయిట్ చేసింది. ఆమెతో చిరంజీవి నటించిన చిత్రాల్లో రెండు సినిమాలు స్వర్ణోత్సవం జరుపుకోగా, మరో సినిమా శత దినోత్సవం జరుపుకొంది.