ఇంటర్ ఫలితాల్లో ముఖ్యాంశాలు

రచ్చబండ, హైదరాబాద్ : విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఇంటర్మీడియట్ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ మారు కూడా బాలికలే పైచేయి సాధించారు. ఫలితాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
• గతేడాది మాదిరిగా రాష్ట్రవ్యాప్తగా బాలికలే అత్యధిక శాతం మంది ఉర్తీర్ణత సాధించారు.

ప్రథమ సంవత్సరం
• ఇంటర్ ఫస్టియర్ లో ఉత్తీర్ణతా శాతం 63.32 శాతం
• ఫస్టియర్ లో అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 76 శాతం ఉత్తీర్ణత వచ్చింది.
• ఫస్టియర్ లో అత్యల్పంగా అంటే కేవలం 40 శాతంతో మెదక్ జిల్లాలో ఉత్తీర్ణత నమోదైంది.
• బాలికలు 72.33 శాతం ఉత్తీర్ణులయ్యారు.
• బాలురు 54.25 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.

ద్వితీయ సంవత్సరం
• ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
• బాలికలు 75.28 శాతం ఉత్తీర్ణులయ్యారు.
• 59.21 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు.
• మేడ్చల్ జిల్లాలో 78 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది.
• అత్యల్పంగా మెదక్ జిల్లాలో 47 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
• జేఈఈ పరీక్షల కారణంగా ఇంటర్ పరీక్షలు ఆలస్యమయ్యాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
• పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి, పకడ్బందీగా నిర్వహించామని మంత్రి వెల్లడించారు.
• ఆగస్టు 1నుంచి అడ్వాన్స్ సప్టిమెంటరీ పరీక్షలు