రచ్చబండ : కీలక దశకు చేరుకున్న మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశం యావత్తు ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా గురువారం సాయంత్రం అదిరిపోయే ట్విస్ట్ ఎదురైంది. బీజేపీ సీఎం పదవి తీసుకోవడంపై వెనుకడగు వేసింది.
ఈ పరిణామాలతో శివసేన చీలికవర్గం నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ మద్దతుతో షిండే ముఖ్యమంత్రిగా తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు.
తాను ప్రభుత్వానికి దూరంగా ఉంటానని ఫడ్నవీస్ ప్రకటించారు. బయట నుంచే మద్దతు తెలుపుతామని బీజేపీ తెలిపింది. దీంతో షిండే తన వర్గం నుంచే మంత్రివర్గాన్ని ఎంపిక చేసుకునే అవకాశం దక్కింది. ఇదే రాత్రి 7గంటలకు షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వెల్లడైంది.
షిండే అను నేను..
నేను ఏనాడూ ముఖ్యమంత్రి పదవిని ఆశించలేదు. నియోజకవర్గ సమస్యలను చర్చించేందుకు ముఖ్యమంత్రి థాక్రేను కలిసేందుకు వెళ్లగా తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ప్రస్తుతం బీజేపీ పెద్ద మనసుతో నన్ను సీఎంగా ఒప్పుకుంది.. అని మహారాష్ట్రకు నూతన సీఎం కానున్న ఏక్ నాథ్ షిండే తన మనోగతాన్ని వ్యక్తం చేశారు.