రచ్చబండ : మణిపూర్ రాష్ట్రంలో ఘోర ఘటన చోటుచేసుకొంది. నోనీ జిల్లాలోని ఆర్మీ బేస్ క్యాంపుపై కొండ చరియలు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే 7గురు ఆర్మీ జవాన్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఇంకా కొండ చరియల కింద 56 మంది జవాన్లు చిక్కుకున్నట్లు సమాచారం.
రెస్క్యూ టీం ఆధ్వర్యంలో ముమ్మరంగా రక్షణ చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ రెస్క్యూ టీం 14 మందిని కాపాడింది. అయితే విరిగి పడిన కొండ చరియలు నదీ ప్రవాహానికి అడ్డంగా పడ్డాయి. వాటిని తొలగిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
రెస్క్యూ టీం ఆపరేషన్ కు కష్టంగా మారింది. రైల్వే లైన్ నిర్మాణం కోసం ఆర్మీ బేస్ క్యాంపుపై ఒక్కసారిగా కొండ చరియలు విరిగి బండరాళ్లు పడటంతో కలకలం నెలకొంది. అనూహ్యంగా ఈ ఘటన జరగడంతో జవాన్లు అప్రమత్తం కాలేకపోయారు.