కేసీఆర్ ను గద్దె దించుదాం

• కేంద్ర మంత్రి అమిత్ షా పిలుపు
• తుక్కుగూడ సభలో పూర్తి ప్రసంగం 

తెలంగాణ సీఎం కేసీఆర్ ను గద్దె దించుదాం.. అని బీజేపీ అగ్రనేత, కేంద్రం మంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ముగింపు సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఆయన పూర్తి ప్రసంగం ఆయన మాటల్లోనే..

• బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్ర అధికార బదలాయింపు కోసం కాదు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం.
• కేసీఆర్ ను గద్దె దించేందుకు నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. బీజేపీ యువ నేత బండి సంజయ్ కుమార్ ఒక్కడు చాలు.
• ప్రజా సంగ్రామ యాత్ర హైదరాబాద్ లో నిజాంను మార్చేందుకు చేసిన యాత్ర
• ఈ యాత్ర తెలంగాణను భారత్ లో కలిపేందుకు పోరాడిన రజాకార్లకు వ్యతిరేకం
• ఈ యాత్ర దళిత, గిరిజన, ఆదివాసీ, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టిన యాత్ర
• ఈ యాత్ర రాచరికాన్ని ప్రోత్సహించే వారికి వ్యతిరేకం
• బీజేపీని శత్రువుగా భావించకండి
• ముందస్తు ఎన్నికలకు మేము సిద్ధం
• తెలంగాణ నిజాంను మార్చాలా? వద్దా?
• కేసీఆర్ హామీ ఇచ్చిన నీళ్లు, నిధులు, నియామకాల హామీ ఏమైంది.
• మేము అధికారంలోకి వస్తే నీళ్లు, నిధులు, నియామకాల హామీని తప్పక అమలు చేస్తాం. దానికి బాధ్యత తీసుకుంటాం.
• కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు రాష్ట్ర యువత సిద్ధంగా ఉంది.
• టీఆర్ఎస్ ఇచ్చిన రైతుల రుణమాఫీ హామీ అమలు కాలేదు.
• ధాన్యం కొనుగోలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే..
• మేము అధికారంలోకి వచ్చాక ప్రతీ ధాన్యపు గింజను కొంటాం.
• హైదరాబాద్ విముక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే సాధ్యమైంది.
• పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్న కేసీఆర్ తన హామీ నెరవేర్చలేదు.
• తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతానని ఎంఐఎంను చూసి కేసీఆర్ వెనక్కి తగ్గారు.
• ఎంఐఎం, కేసీఆర్ ను ఒకేసారి సాగనంపి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేము నిర్వహిస్తాం.
• ఎంఐఎం, కేసీఆర్ ను చూసి భయపడే ప్రసక్తే లేదు.
• టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది.
• మేము అధికారంలోకి వస్తే మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తాం. 
• కేంద్ర నిధులతో చేపట్టే పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చిత్రీకరిస్తున్నారు.
• కేసీఆర్ కొడుకు, బిడ్డలకు అధికారం ఇచ్చారు. కానీ సర్పంచులకు మాత్రం ఇవ్వలేదు.
• ఖమ్మం సాయి గణేష్ ఆత్మహత్య కేసును వదలబోము. నిందితులను శిక్షించి తీరుతాం.
• రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని కేసీఆర్ చేశారా..
• మన ఊరు- మన బడి పథకం నిధులు కేంద్ర ప్రభుత్వానివే..
• సైన్స్ సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదు.
• వరంగల్ నగరంలో సైనికల్ స్కూల్ కోసం కూడా రాష్ట్రం భూమిని ఇవ్వలేదు.
• ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదు.
• ఇలాంటి సర్కారు మీకు అవసరమా?
• బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారుతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తాం.