త్వరలో రాహుల్ గాంధీ యాత్ర

కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టకేలకు అధికారమే పరమావధిగా ఆ పార్టీ పావులు కదుపుతోంది. దీంతో మళ్లీ రాహుల్ గాంధీని క్రియాశీలకం చేయాలని నిర్ణయించింది.

తాజాగా రాజస్థాన్ ఉదయ్ పూర్ లో జరుగుతున్న చింతన్ శిబిర్ లో రాహుల్ పాత్రపై చర్చ జరిగింది. దేశవ్యాప్త యాత్ర చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. ప్రజల్లో మమేకం చేసి లబ్ధి పొందాలని చూస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ యాత్ర చేపడతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిలో భాగంగా ఎక్కువ భాగం రాహుల్ పాదయాత్ర ఉంటుందని తెలిసింది. దీని ద్వారా దేశంలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటారని పేర్కొన్నాయి.

రాహుల్ గాంధీ చేపట్టే యాత్ర వచ్చే ఏడాది ఉంటుందని తెలుస్తోంది. ఎన్నికల దాకా యాత్ర చేపట్టే అవకాశం ఉంది. అయితే దీనిపై త్వరలోనే ప్రకటన రానున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.