14న హాలియాకు కేటీఆర్ రాక

• సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ వెల్లడి
నిఘా, హాలియా : ఈనెల 14న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రూ.50 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ రానున్నారు. ఈ మేరకు సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ వెల్లడించారు. హాలియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భగత్ మాట్లాడారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధితోనే సమాధానం చెబుతామని అన్నారు. నియోజకవర్గంలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ తో పాటు ఆధునిక పరిజ్ఞానంతో కూడిన వైకుంఠధామాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి పల్లె అభివృద్దికి మరొక రూ.120 కోట్ల ప్రతిపాదనలు పంపించామని ఎమ్మెల్యే వివరించారు. ఈ నెల14న హాలియలో సభను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ సభకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపినిచ్చారు.
సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రామచంద్రనాయక్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.