కల్లు గీత కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పల్లె రవికుమార్
తెలంగాణ రాష్ట్ర కల్లు గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పల్లె రవికుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పల్లె రవికుమార్ ఈ పదవిలో రెండేండ్ల పాటు కొనసాగుతారు. అయన నియామకంతో జర్నలిస్టులు, బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
పల్లె రవికుమార్ తెలంగాణ ఉద్యమంలో టీజేఎఫ్ అధ్యక్షుడిగా జర్నలిస్టులను ముందుకు నడిపించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను జర్నలిస్టుల్లో రగిలించారు. అనాడు ఉద్యమ రథసారథి, నేటి ముఖ్యమంత్రి మెచ్చిన నేతగా అయన గుర్తింపు పొందారు. అనంతరం పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పల్లె రవికుమార్ సొంత నియోజకవర్గమైన మునుగోడు ఉప ఎన్నిక సందర్బంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయన చేరికతో అయన సతీమణి, మునుగోడు ఎంపీపీతో పటు పలువురు బీసీ నేతలు తోడుగా వచ్చారు. దీంతో బీఆర్ఎస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీలో చేరిక సమయంలో మంత్రి కేటీఆర్ రవికుమార్ కు మంచి గుర్తింపు ఇస్తామన్న హామీతో నేడు కల్లు గీత కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించారు