మే 5న చలో బుద్ధవనం కార్ ర్యాలీ

మే 5న చలో బుద్ధవనం కార్ ర్యాలీ
– 200 కార్లతో భారీ ర్యాలీ
– హైదరాబాద్, సాగెర్ పయనం
– బీఎస్ఐ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మర్పల్లి అశోక్
రచ్చబండ, శంకర్ పల్లి : ఈ నెల 5వ తేదీన బుద్ధ పూర్ణిమ సందర్భంగా, తథాగత గౌతమ బుద్ధ 2567వ బుద్ధ జయంతిని పురస్కరించుకొని 200 కార్లతో కార్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని బీఎస్ఐ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మర్పల్లి అశోక్ తెలిపారు. మంగళవారం శంకర్ పల్లిలో అయన మీడియాతో మాట్లాడారు. భారతీయ బౌద్ధ మహాసభ తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం దగ్గర నుండి నాగార్జునసాగర్లో గల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బుద్ధవనం వరకు ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని స్థానిక అంబేద్కర్ భవన్లో ఆవిష్కరించి మర్పల్లి అశోక్ మాట్లాదారు. బుద్ధ జయంతి రోజున బుద్ధవనంలో బుద్ధపూజ కార్యక్రమం, ధమ్మ ప్రవచనం, ధమ్మ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కాబట్టి బౌద్ధ అభిమానులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు వ్యాపార, రాజకీయ, సామాజిక కార్యకర్తలు అధిక సంఖ్యలో బౌద్ధ సాంస్కృతిక ధమ్మ మహోత్సవ యాత్రలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు. కార్యక్రమంలో బాలకిషన్, రాములు, రామచందర్, నగేష్, లక్ష్మయ్య, నర్సింలు, శంకర్, గండయ్య, శ్రీనివాస్, ప్రవీణ్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.