ఐపీఎల్ 14వ సీజన్ కు సంబంధించి మ్యాచ్ తేదీలు ఖరారైనట్లు సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఏప్రిల్ 9న మొదలై.. మే 30 వరకు జరగనుంది. కాగా 52 రోజుల పాటు జరగనున్న ఐపీఎల్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగనుండగా.. ఫైనల్ మ్యాచ్ మే 30వ తేదీన జరగనుంది.అయితే దీనిపై గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం తెలపాల్సి ఉంది. దీనికి సంబంధించి వచ్చేవారం ఐపీఎల్ గవర్నింగ్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌తో పాటు వేదికలను కూడా ఖరారు చేయనున్నారు.