కొండకల్ లో భక్తిశ్రద్ధలతో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన

* పాల్గొన్న ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కాలే యాదయ్య

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ గ్రామంలో శనివారం జరిగిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో మూడు రోజులుగా శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన పూజలు జరిగాయి.

ఈ మహోత్సవానికి మండలంలోని అనేక గ్రామాల భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. గ్రామ ఎంపీటీసీ బద్దం సురేందర్ రెడ్డి, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగాయి. మండలంలోని వివిధ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.