కోయచలకలో అభివృద్ధి పనులకు శ్రీకారం

రచ్చబండ, రఘునాథపాలెం : ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామంలో శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.58 లక్షలతో చేపట్టిన వివిధఅభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.10 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనతరం కోయచలక గ్రామంలో రూ.48 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, 16 డ్రైన్లను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.