రచ్చబండ, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న నగరం. సాఫ్ట్‌వేర్ రంగం దినదిన ప్రవర్థమానమవుతోంది. రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతోంది. వ్యాపార, వాణిజ్య రంగాల్లో విశేష వృద్ధిని చాటుతోంది. ఇలాంటి హైదరాబాద్ నగరంలో మరో విశిష్టతను సొంతం చేసుకుంది. తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల్లో తన సత్తా చాటింది.
ఇంతకు ముందు బెంగళూరు నగరం ఆస్థానాన్ని దక్కించుకోగా, ప్రస్తుతం బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ దాటేసింది. @india.in.pixels సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా ప్రజల తలసరి ఆదాయం రూ.6.25 లక్షలుగా ఉంది. గతంలో బెంగళూరు అర్బన్ జిల్లా తలసరి ఆదాయం రూ.5.42 లక్షలుగా ఉండేది. గతంలో టాప్ ప్లేస్‌లో ఉన్న బెంగళూరును వెనక్కి నెట్టి హైదరాబాద్ తన సత్తా చాటింది.