రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : కొందరి జీవితాల్లో ఒక్కోసారి చిత్ర, విచిత్రాలు చోటు చేసుకుంటాయి. అలాంటి ఓ విచిత్ర ఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి ఎదురైన ఆ సంఘటన షాకింగ్‌కు గురిచేసింది. మతిపోయేలా ఉన్న ఈ ఘటనతో చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అదేంటో చూద్దాం రండి..
యూపీలోని ఓ గ్రామంలో ఆర్తీదేవి అనే మహిళ హత్య చేశాడనే నేరంపై ఆమె భర్త సోను జైలుకెళ్లాడు. 18 నెలల శిక్షను అనుభవించాడు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇంటికి తిరిగొచ్చే సరికి సోనుకు దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్ కళ్లెదుట కనిపించింది.
హత్యకు గురైందనుకున్న ఆయన భార్య ఆర్తీదేవి వేరొక వ్యక్తితో ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ మేరకు సోను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆర్తీదేవిని అరెస్టు చేసి విచారించారు.
ఆర్తీదేవి కొన్నాళ్లు కనిపించకపోవడంతో భర్త సోనుపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కొన్నిరోజులకు ఓ గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో అది తన కూతురుదేనని ఆర్తీదేవి తండ్రి అంగీకరించాడు. దీంతో చేయని తప్పుకు సోను జైలు శిక్షను అనుభవించాల్సి వచ్చింది.