ఇండియాతో పాటు మరో ఐదు దేశాల్లో ఆగస్టు 15నే స్వాతంత్ర్య దినోత్సవం

రచ్చబండ : భారతదేశానికి 1947 ఆగస్టు 15న బ్రిటీష్ ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యం సిద్ధించింది. అప్పటి నుంచి ప్రతీ ఏటా అదేరోజున దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జాతి ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. జాతి నేతలను స్మరించుకుంటూ జెండా పండుగను వేడుకలా నిర్వహిస్తారు.

మన దేశంలో లాగే మరో 5 దేశాలకు ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధంచింది. 1945 ఆగస్టు 15న జపాన్ నుంచి దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాలు స్వాతంత్ర్యం పొందాయి.

అదే విధంగా 1960 ఆగస్టు 15న ఆఫ్రికన్ దేశమైన కాంగో దేశం ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం సిద్ధించింది. 1971 ఆగస్టు 15న బ్రిటీష్ ప్రభుత్వం నుంచి బహ్రెయిన్, లిచెన్ స్టెయిన్ జర్మనీ నుంచి స్వాంతంత్ర్యం పొందాయి.