భారత్ ఆర్మీ డాగ్ కు గ్యాలంట్రీ అవార్డు.. సైనికులను కాపాడేందుకు ప్రాణాలర్పించిన కుక్క

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : భారత్ ఆర్మీలో విశేష సేవలందించిన సైనికులకు అవార్డులు ఇచ్చి సత్కరించుకోవడం ఆనవాయితీ. ప్రతీ ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన సైనికులకు వారి సేవలకు గాను వివిధ స్థాయిల్లో అవార్డులు ఇచ్చి గౌరవిస్తుంటారు. కొందరికి మరణానంతరం కూడా ఆ గౌరవం దక్కుతుంది. అయితే భారత్ ఆర్మీ కోసం పని చేసిన ఓ కుక్కకు మరణానంతరం విశిష్ట అవార్డు ఇచ్చి గౌరవించడం విశేషం

భారత ఆర్మీకి చెందిన ఎలైట్ అటాల్ట్ డాగ్ ఆక్సెల్ కు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకుల సందర్భంగా సైనికులకు ఇచ్చే గ్యాలంట్రీ అవార్డు అందజేసి గౌరవించుకున్నారు.

జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని బారాముల్లా జిల్లాలోని వనిగం బాలా వద్ద ఉగ్రవాది పేల్చిన బుల్లెట్లకు ఆక్సెల్ డాగ్ కన్నుమూసింది. దానిని నిజమైన హీరోగా సైన్యం అభివర్ణించింది.

ఆక్సెల్ 2020 జూన్ 26న జన్మించింది. 2021 డిసెంబరులో ఇండియన్ ఆర్మీ 26 యూనిట్ లో చేర్చుకున్నారు. వివిధ విభాగాల్లో దీనికి శిక్షణ ఇచ్చారు.

ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో సైనికుల ప్రాణాలు కాపాడేందుకు ప్రమాదకరంగా ఉన్న ఓ భవనంలోకి ఆ డాగ్ దూరేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో ఉగ్రవాది మూడుసార్లు దానిపై కాల్పులు జరిపాడు. దీంతో అది అక్కడికక్కడే నేలకూలింది.