రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు కొనసాగుతున్నాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అనుమతి లేకుండా తిరంగా యాత్ర నిర్వహించారని ఓ బీజేపీ నేత సహా మరో ఐదుగురిపై కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీలోని వీఐపీ కార్కేడ్ రిహార్సల్ లో బీజేపీ నేత కుల్జీత్ సింగ్ చాహల్ నేతృత్వంలో ఈనెల 12న తిరంగా యాత్ర నిర్వహించారు. అక్కడ 144 సెక్షన్ అమలులో ఉంది.
ఈ మేరకు ఆయనతో పాటు మరో ఐదుగురిపై అధికారులు తాజాగా కేసు నమోదు చేశారు. భారత శిక్షాస్మృతిలోని 186, 188 సెక్షన్ల కింద తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.