అందరిపై అల్లా ఆశీస్సులుండాలి

• సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్

ప్రజలందరిపై అల్లా ఆశీస్సులు ఉండాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ కోరారు. నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలోని పైలాన్ కాలనీలో మొహ్మద్ అర్షద్ నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని, ముస్లింలతో ఉపవాస దీక్ష విరమింపజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. అనంతరం ముస్లింలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుంటుక వెంకట్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బిన్నీ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాదం సాదం సంపత్ కుమార్, మోద్దుకూరి రాంబాబు, హజి, ఫయీమ్, ఖాళీక్, తెరాస నాయకులు షేక్ అబ్బాస్, ప్రసాద్, గంజి అనిల్, ఘని, నరేందర్, సోహైల్, సాగర్ రెడ్డి, హైమద్ అలీ, కట్టెబోయిన అనిల్ కుమార్, నడ్డి బాలరాజ్, మెండే సైదులు, షరీఫ్, సలీం, ముస్లిం మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు.