కల్వర్టులు కబ్జా చేస్తే చర్యలు తప్పవు

* శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య

రచ్చబండ, శంకర్ పల్లి: కల్వర్టులు, మురుగు కాలువలను కబ్జా చేస్తే చర్యలు తప్పవని శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య హెచ్చరించారు. ఇటీవల హైదరాబాద్ రోడ్డుపై మోకిలా గ్రామ శివారులో శ్రీ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ వద్ద కల్వర్టు కాలువను కొందరు మూసివేయడం వల్ల మురికి నీరు చేరి ఆ ప్రాంతమంతా దుర్వాసన జరిగింది.

ఈ సంఘటనపై వార్తలు రావడంతో ఇరిగేషన్ అధికారులు కల్వర్టుకు అడ్డంగా వేసిన సిమెంటు గోడను తొలగించారు. కాగా శనివారం ఎంపీడీవో వెంకయ్య ఆ కాలువను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాగులు, నాళాలు కబ్జా చేసి కట్టడాలు నిర్వహిస్తే వాటిని నిర్దాక్షణంగా కూల్చివేస్తామని హెచ్చరించారు.