హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ అసెంబ్లీ ఇన్ చార్జులను, సమన్వయకర్తలను, మండల బాధ్యులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహను హుజురాబాద్ అసెంబ్లీ ఇన్ చార్జిగా నియమించారు. ఎమ్యెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్తలుగా నియమించారు. వీణవంక మండలానికి ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్, జమ్మికుంట మండలం విజయ రమణ రావు, రాజ్ ఠాగూర్, హుజురాబాద్ మండలం టి.నర్సారెడ్డి, లక్షన్ కుమార్, హుజురాబాద్ టౌన్ బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు, ఇల్లంతకుంటా మండలం నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమలపూర్ మండలం కొండా సురేఖ, దొమ్మాటి సాంబయ్యను ఎంపిక చేశారు. కంట్రోల్ రూమ్ సమన్వయకర్తగాను.. కవ్వంపల్లి సత్యనారాయణ, సమాచారం కొరకు దొంతి గోపిని నియమించినట్లు ప్రకటించారు.