ప్రేమ ఎంత కఠినం?

* ఇద్దరూ పారిపోయారు..
* మళ్లీ తిరిగొచ్చారు!
ప్రేమ ఎంత మధురం కదా.. కఠినం అంటున్నాడేంటి.. అనుకుంటన్నారా? నిజమే.. కానీ ఇక్కడ ఇదీ నిజమే.. చివరి దాకా చదవండి మీకే అర్థమవుతుంది.

వారిద్దరూ ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నారు. వారి మనసులు కలిశాయి. ఒకరికొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ పెద్దలు వ్యతిరేకించినా వారు వెనుకంజ వేయలేదు.

కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరులో ఒకే కాలేజీకి చెందిన వారిద్దరూ ప్రేమించుకొని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు వారి పెళ్లికి నిరాకరించారు. దీంతో వారిలో మరింత పట్టుదల పెరిగి ప్రేమ ముదిరి పాకాన పడింది.

మరిన్ని ఆశలు పెంచుకొని తమ పెళ్లి జరిపించాలని స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వారు కూడా ప్రేమికుల వినతికి నో చెప్పారు. దీంతో వారిద్దరూ చిలకా, గోరింకల వోలే గ్రామాన్నే వదిలి పారిపోయారు.

వారికి ఎలాంటి ఘటన ఎదురైందో ఏమో కానీ రోజులకే వారిద్దరూ మళ్లీ తమ సొంతూరికి తిరిగొచ్చారు. ఇరు కుటుంబాల వాళ్లు పోలీసుల సాయంతో ఇద్దరికీ నచ్చజెప్పి తమ ఇళ్లకు తీసుకెళ్లారు. దీంతో కథ సుఖాంతమైంది.

అయితే అసలు ట్విస్ట్ ఏమిటంటే.. వారిద్దరూ యువతులు. అందుకే పెద్దలు, పోలీసులు, ఇతర సమాజం వారి పెళ్లికి అంగీకరించలేదు. ఇటీవలే ఏపీలో ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్న ఘటన జరిగింది. అది మరువక ముందే తాజాగా కర్ణాటకలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఏది ఏమైనా యువతులైన ఇద్దరిలో ప్రేమ ఎలా కలిగిందో.. పెళ్లి చేసుకోవాలని ఎందుకనిపించిందో కానీ అలా జరగడం ప్రకృతి విరుద్ధమే కదా..