- బీజేపీ చేవెళ్ల నియోజకవర్గ నాయకుడు తొండ రవి
రచ్చబండ, శంకర్ పల్లి: హిందువులు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని బీజేపీ చేవెళ్ల నియోజకవర్గ నాయకుడు తొండ రవి కోరారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని సూచించారు. సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన ప్రపంచ స్థాయిలో పేరుందిన సనాతన ధర్మ ఫౌండేషన్ ఫౌండర్ సుదేశ్ అగర్వాల్ తన స్వగృహానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. హిందూ ధర్మ కార్యక్రమాలకు అందరూ సహకరించాలని కోరారు.