వాల్మీకి ఫౌండేషన్ సేవలు అభినందనీయం

వాల్మీకి ఫౌండేషన్ సేవలు అభినందనీయం
* ఘనంగా వాల్మీకి ఫౌండేషన్ 15వ వార్షికోత్సవ సంబరాలు

 

రచ్చబండ, శంకర్ పల్లి : వాల్మీకి ఫౌండేషన్ సేవలు అభినందనీయం అని పలువురు వక్తలు కొనియాడారు. వాల్మీకి ఫౌండేషన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా, శంకర్పల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థినులకు, జెడ్ పీహెచ్ బాలికలు, కేజీబీవీలో చదువుకునే విద్యార్థులకు శనివారం శానిటరీ ఫ్యాడ్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో ఈ మూడు పాఠశాలల విద్యార్థినులతో పాటు బాలుర పాఠశాల విద్యార్థులకు 1000 స్కూల్ బ్యాగ్స్, 20 సైకిల్స్, స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగాని, ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఖదరవల్లి కృష్ణప్రియ, తిమ్మయ్యగారి వాణీ మాట్లాడుతూ.. అమ్మాయిలు చదువుతోపాటు ఆరోగ్యం పరిశుభ్రత పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, మంచి ఆరోగ్యం ఉన్నట్లయితే చదువు పట్ల ఏకాగ్రత పెరుగుతుందని తద్వారా మనం సాధించాలనుకున్నది శుభమవుతుందని తెలియజేసి, అమ్మాయిల వ్యక్తిగత పరిశుభ్రతపై వివరించారు.

ఈ సందర్భంగా వాల్మీకి ఫౌండేషన్ చైర్మన్ సూర్య గణేష్ వాల్మీకి, జనరల్ సెక్రెటరీ హరికిషన్ వాల్మీకి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి మంచి సమాజ నిర్మాణం కోసం వాల్మీకి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద, తల్లిదండ్రులు లేని విద్యార్థుల కోసం మంచి నాణ్యమైన విద్యను అందించడానికి వాల్మీకి గురుకుల్ పాఠశాలను ఏర్పాటు చేసి ప్రైవేటు పాఠశాలల్లో విద్యాభ్యాసం చేయించడంతోపాటు వారి కళలను సహకారం చేయడం జరుగుతుందని, పౌష్టికాహార లోపంతో ఎవరు కూడా బాధపడకుండా ఉండాలని ఎగ్గు బ్యాంకు సర్వీసెస్ నిర్వహిస్తున్నామని, రుతుచక్ర పేదరికం నిర్మూలించడానికి ఎండ్ పీరియడ్ పావర్టి కార్యక్రమాన్ని ఈసారి చేపట్టడం జరిగిందని తెలిపారు.

అందులో భాగంగానే ఈరోజు 1500 మంది అమ్మాయిలకు ఆరు నెలలకు సరిపడా శానిటరీ ఫ్యాట్స్ పంపిణీ చేయడంతో పాటు, అమ్మాయిల విద్యను మెరుగుపరుచుటకై సుదూర ప్రాంతాల నుండి పాఠశాలలకు నడుచుకుంటూ వచ్చే విద్యార్థినులకు 20 సైకిళ్ళు అందించడంతోపాటు, జడ్పీహెచ్ఎస్ బాలుర, బాలికల టీఎస్ మోడల్ స్కూల్,కేజీబీవీ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు 1000 స్కూల్ బ్యాగ్స్ అందించి పది పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్స్ అందించడం జరిగిందని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మునిసిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, స్థానిక కౌన్సిలర్ శ్వేత పాండు రంగరెడ్డి గారు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య,అంజయ్య, రత్నప్రభ,జ్యోతి,మధురణి,మరియు విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.