పరిగి నిరుద్యోగులకు శుభవార్త

పరిగి : వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పరిధిలోని నిరుద్యోగులకు ఉచిత శిక్షణ కోసం శుభవార్త అందింది. పోలీస్, గ్రూప్స్ ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే ఉద్యోగార్దులకు టీఆర్ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు మాజీ ఎమ్మెల్యే టీ.రామ్మోహన్ రెడ్డి (టీఆర్ఆర్) వెల్లడించారు.

పరిగి పట్టణంలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. హైదరాబాద్ లోని ప్రముఖ ఐఆర్ఐఎస్ఈ కోచింగ్ సెంటర్ ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.

మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు అందిస్తామని వివరించారు. ఏప్రిల్ 4 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత కోచింగ్ ఉంటుందని తెలిపారు.

అభ్యర్థులు సోమవారం అంటే మార్చి 28వ తేదీ నుంచి పరిగిలోని టీఆర్ఆర్ కార్యాలయంలో పేర్లు నమోదు చేయించుకోవాలని తెలిపారు.

వివరాలకు ఆఫీస్ ఇంచార్జ్ అశోక్ రెడ్డి-966871231, నవాజ్-9052414982 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని తెలిపారు.