శంకర్ పల్లిలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిపిన చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి పట్టణంలోని బద్దం జ్యోతి కన్వెన్షన్ హాలులో సోమవారం రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదినోత్సవాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. కేటీఆర్ జన్మదిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రత్నం కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని సేవలు చేస్తున్నారని తెలిపారు.

 

రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను మూడోసారి సీఎంగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. తాను చేవెళ్ల బిడ్డగా ఉండాలని, చేవెళ్ల నియోజకవర్గం ప్రజలు తనను గతంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా, ఎమ్మెల్యేగా గెలిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు. ఎప్పటికీ చేవెళ్ల గడ్డను మరునని అన్నారు. కాగా కొందరు కేటీఆర్ జన్మదిన సందర్భంగా సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అబండాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

తెలంగాణ రాష్ట్ర పోరాట సమయంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి ప్రజలను జాగృతం చేశానని తెలిపారు. ఎప్పటికీ తాను బి ఆర్ ఎస్ పార్టీలో కొనసాగుతూ ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని కొనియాడారు.

 

ఈ కార్యక్రమంలో కొండకల్ గ్రామ ఎంపిటిసి బద్దం సురేందర్ రెడ్డి, పిల్లిగుండ్ల గ్రామ ఉపసర్పంచ్ ధరణి ఐలయ్య, శంకర్ పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు గండేటి శ్రీనాథ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ రాథోడ్, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దేవుని పరమేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ బీర్ల నరసింహ, శంకర్ పల్లి మాజీ సర్పంచ్ శ్రీధర్, మాజీ ఉపసర్పంచ్ దండు సంతోష్, జనవాడ గ్రామ వార్డు సభ్యుడు శివరాజ్, నాయకులు సామయ్య, బయన్న, సింహరాజు, శేఖర్ గౌడ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.