ప్రజలు పరిసరాలను ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
* శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య
రచ్చబండ, శంకర్ పల్లి; వర్షాలు కురుస్తుందని ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య సూచించారు. శనివారం మండలంలోని జనవాడ గ్రామంలో ఇండ్ల పరిసరాలను, రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ వర్షాకాలంలో విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులు ప్రభలుతాయని అందుకోసం ప్రజలు తమ ఇంటి పరిసరాలు నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
గ్రామపంచాయతీ వారు ఈగలు, దోమలు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్ల వెంబడి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ నాగభూషణం గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.