ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి

మండల తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సభ్యులు

రచ్చబండ, శంకర్ పల్లి: ఉద్యోగుల, మండల ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని మండల తెలంగాణ ఉపాధ్యాయ సంఘం సభ్యులు మంగళవారం శంకర్ పల్లి తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ ప్రియాంకకు వినతి పత్రాన్ని అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో తాము తీవ్ర మానసికంగా కృంగిపోతున్నామని తెలిపారు. గతంలో అనేకసార్లు తాము ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు లక్ష్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి శ్రీను, కృష్ణయ్య, మహేశ్వరరావు, సంధ్యా, రంగారెడ్డి పాల్గొన్నారు.