- రూ.51 లక్షల అందజేత
రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయానికి శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సభావత్ రాజునాయక్ రూ.2,51,000 భూరి విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రథమంగా ఇంత పెద్ద అయ్యప్ప స్వామి ఆలయాన్ని స్థానికులు నిర్మించడం సంతోషకరం అన్నారు. ప్రతి ఒక్కరు దైవచింతన అలవర్చుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులు ప్రవీణ్ కుమార్, జూలకంటి పాండురంగారెడ్డి, కె.జంగయ్య, అడ్వకేట్ విశ్వేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.