రచ్చబండ, శంకర్ పల్లి: ఈనెల 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలలోని క్రీడా ప్రాంగణంలో అథ్లెటిక్స్, ఫుట్ ఫుట్ బాల్, ఖోఖో, వాలీబాల్ క్రీడలు నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో వెంకయ్య తెలిపారు. ఈ క్రీడలలో మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న క్రీడాకారులు పాల్గొనవచ్చని తెలిపారు.
15, 35 సంవత్సరాల వయసున్న మహిళలు, పురుషులు ఈ క్రీడలలో పాల్గొనాలని తెలిపారు. ఈ క్రీడలకు చైర్మన్ గా ఎంపీపీ, మెంబర్ గా జడ్పిటిసి, కన్వీనర్ గా ఎంపీడీవో వ్యవహరిస్తారని వివరించారు. సభ్యులుగా తహసీల్దారు, సీఐ, ఎంసి, పిడిఎస్ లు వ్యవహరిస్తారని అన్నారు. క్రీడాకారులు పాపా ఆశీర్వాదం, నరసింహులను సంప్రదించాలని తెలిపారు.
ఈ క్రీడల్లో గెలిచిన క్రీడాకారులకు మెడల్స్, సర్టిఫికెట్లు ఇచ్చి జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు. వివరాలకు 9848416355 నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని కోరారు.