ఆమనగల్లులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

రచ్చబండ, ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ 11వ వార్డు ఆదర్శనగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులను జాతీయ బీసీ మాజీ కమిషన్ మెంబెర్ తల్లోజు ఆచారి, మున్సిపల్ ఛైర్మెన్ రాంపాల్ నాయక్, వైస్ ఛైర్మెన్ దుర్గయ్య, కౌన్సిలర్ బైకని యాదమ్మ శ్రీశైలం యాదవ్ ప్రారంభించడం జరిగింది.

15వ ఫైనాన్స్ నిధుల ధ్వారా రూ.10 లక్షలతో దాదాపు 330 మీటర్ల వరకు అండర్ గ్రౌండ్ పనులను జరుగుతున్నాయి . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. దశల వారీగా సమస్యలు తీరుస్తాము అని కాలనీలో ఏమైనా సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.

ఈ కార్యక్రమములో మాజీ జెడ్పీటీసీ కండే హరిప్రసాద్, కౌన్సిలర్లు విజయ్ కృష్ణ, చెన్నకేశవులు, దివ్య శ్రీకాంత్ సింగ్, నాయకులు రాంరెడ్డి, గిరి యాదవ్, వెంకటేష్, శ్రీను, శంకరయ్య, జగదీశ్వర్ చారి, లండం కృష్ణయ్య, శేఖర్, భాస్కర్ రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.