రైతుల వివాదం.. ట్రాక్టర్ దహనం

రెండు రైతు కుటుంబాల నడుమ నెలకొన్న వివాదం ఓ ట్రాక్టర్ దహనానికి దారితీసింది. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా గరిడిపల్లి మండలం శీతల తండా పరిధిలో జరిగిన ఈ ఘటనపై గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శీతల తండా గ్రామంలో గుగులోతు శాంతకు చెందిన వరి పొలం కోతకు వచ్చింది.  పక్కనే ఉన్న మరో రైతు గుగులోతు కృష్ణ వ్యవసాయ భూమిలో నుంచి వెళ్లాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో శాంత అదే తండాకు చెందిన గుగులోతు పాప అనే వ్యక్తి ట్రాక్టర్ ను  కిరాయికి తీసుకొని వచ్చి పొలం కోయిస్తుండగా కృష్ణ, అతని భార్య వచ్చి పాపతో తమ భూమిలో నుండి ట్రాక్టర్ను ఎలా తోలుకోవచ్చావ్ అంటూ ప్రశ్నించారు. దీంతో వివాదం ముదిరింది అని గ్రామస్థులు అన్నారు. దీంతో ఇరువురు గొడవకు దిగి దాడి చేసుకున్నారన్నారు. అదే సమయంలో పాప ట్రాక్టర్ కు కృష్ణ కుటుంబ సభ్యులు నిప్పంటించడంతో పూర్తిగా దగ్ధమైనట్టు తెలిపారు.