ప్రముఖ సినీ నటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ కు ప్రతిష్ఠాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ మేరకు 51వ దాదా సాహెబ్ పాల్కే అవార్డుకు రజనీకాంత్ ను ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గురువారం ప్రకటించారు. దీంతో రజనీకాంత్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇదిలా ఉండగా తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన అభిమానుల ఓట్లు దండుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించిందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తుండటం గమనార్హం.