తెలంగాణ టెన్త్, ఇంటర్ ఫలితాలపై ఉత్కంఠ!

తెలంగాణ రాష్ట్ర టెన్త్, ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కూడా దాని కోసం కసరత్తు చేస్తూనే ఉంది. కానీ సరైన తేదీ ప్రకటించకపోవడంతో విద్యార్థుల్లో అసహనం నెలకొంది.

ఇంటర్ ఫలితాలు ఈనెల 25న అని సూచన ప్రాయంగా తెలిసినా ఒకరోజు ఆలస్యంగా అంటే 26న వెల్లడి చేసే అవకాశముంది. 25నే విడుదల చేయాలని అనుకున్నా, మార్కులను కంప్యూటర్ ద్వారా ఫీడ్ చేసే క్రమంలో కొన్ని తప్పులు దొర్లినట్లు తెలిసింది. ప్రస్తుతం ఫలితాల ప్రకటనపై ప్రాక్టికల్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

పదో తరగతి ఫలితాల వెల్లడి కోసం అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిసింది. ఈనెల 30 నాటికి ఫలితాలను వెల్లడించే అవకాశముంది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా సరి చూసుకుంటున్నట్లు సమాచారం. టెన్త్, ఇంటర్ ఫలితాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.