సరయూ నదిలో ముద్దులతో భార్యభర్తల స్నానం.. చితకబాదిన జనం

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అయోధ్య వద్ద సరయూ నదిలో భార్యాభర్తలు స్నానం చేస్తుండగా అక్కడి ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది. ఎందుకో తెలుసా స్నానం చేస్తూ ముద్దులు పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తమైంది.

అయోధ్య పవిత్రమైన స్థలంతో పాటు పుణ్యనది అయిన సరయులో స్నానం చేస్తూ సరసాలాడటంపై అక్కడి జనం చూస్తూ ఉండలేకపోయారు. వారి స్నానం చేస్తూ సరసాలాడటాన్ని పరిశీలిస్తూ ఉన్న వారు ముద్దులాడే సరికి ఓపిక పట్టలేక ఏకంగా భర్తను లాగేసి చితకబాదారు.

అతడి భార్య అడ్డుకోబోయినా దెబ్బలు ఆపలేదు. పెద్ద ఎత్తున గుమిగూడిన జనం తలా ఓ దెబ్బ కొట్టసాగారు. ఎలాగోలా వారి బారి నుంచి దూరంగా వెళ్లిపోయారు.

ఇదిలా ఉండగా దానిని అక్కడి వారెవరో వీడియో తీశారు. ఈ వీడియో వైరల్ కావడంతో అది కాస్తా పోలీసుల వద్దకూ చేరింది. దీంతో స్పందించిన పోలీసులు నిందితులపై చర్యలు తప్పవని చెప్పాల్సి వచ్చింది.